ప్రతి రైతు వివరాలు ఆన్లైన్లో తప్పనిసరిగా నమోదు చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పిఎల్ వరలక్ష్మీ పేర్కొన్నారు నేడు గురువారం 2025-26 సంవత్సరానికి సంబంధించి జాతీయ ఆహార భద్రత మరియు పోషకాహార పథకము, పంట కోత ప్రయోగంపై అవగాహన కార్యక్రమం జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడింది.ఈ సమావేశంలో జిల్లా లోని అన్ని మండలాల వ్యవసాయ అధికారులు, సహాయ వ్యవసాయ సంచాలకులు, జిల్లా వనరుల కేంద్ర సిబ్బంది, వ్యవసాయ విస్తరణ అధికారులు, గ్రామ వ్యవసాయ సహాయకులు పాల్గొన్నారు.కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ అధికారి శ్రీమతి పి.ఎల్. వరలక్ష్మి, జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి శ్రీమతి భారతి, సహాయ వ్యవసాయ సంచాలకుల