యూరియా ను పక్కదారి పట్టిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, అలాగే అధికారులు పొరపాట్లు చేస్తే కఠిన చర్యలు తప్పవని, జాగ్రత్తగా, రైతులకు ఇబ్బంది లేకుండా యూరియా పంపిణీ సజావుగా జరగాలని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం 4 గంటలకు కర్నూలు జిల్లా లోని సబ్ కలెక్టర్, ఆర్డీవోలు,వ్యవసాయ శాఖ అధికారులు, డీఎస్పీ లు, తహసీల్దార్లు తదితరులతో జిల్లా కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి యూరియా పంపిణీ పై నిన్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారని తెలిపారు.. జిల్లాలో యూరియా సరఫరా, పంపిణీ కి సంబంధి