Parvathipuram, Parvathipuram Manyam | Aug 28, 2025
ఆరోగ్య కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచుతూ రోగులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలని ఎన్.సి.డి పిఓ,స్వచ్ఛఆంధ్ర నోడల్ అధికారి డాక్టర్ టి. జగన్ మోహనరావు సూచించారు. పెదంకలo ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఆయన తనిఖీ చేశారు. స్వచ్ఛఆంధ్రలో బాగంగా ఆసుపత్రిలో స్వచ్ఛతా ప్రమాణాలు పాటిస్తున్న తీరుపై పరిశీలించారు. ముందుగా అక్కడకు వైద్య పరీక్షల కొరకు వచ్చిన రోగులతో ఆయన మాట్లాడి ఆరోగ్య స్థితి పరిశీలించారు.జ్వర లక్షణాలతో వచ్చిన ఒక పాపకు ల్యాబ్ టెక్నీషియన్ చే నిర్ధారణ పరీక్షలు చేయించారు.ఓపి రికార్డు తనిఖీ చేశారు.కుక్క కాటుతో చికిత్స కోసం ఎవరైనా వస్తున్నదానిపై ఆరా తీశారు.