వైసిపి మాజీ మంత్రి పేర్ని నానిపై బందరు జనసేన పార్టీ ఎంపీ వల్లభనేని బాలశౌరి ఫైర్ సోమవారం మద్యాహ్నం 4 గంటల సమయంలో స్తానిక మచిలీపట్నం ఎంపి కార్యలయంలో వైసిపి మాజీ మంత్రి పేర్ని నాని పై ఎంపీ వల్లభనేని బాలశౌరి తీవ్రంగా మండిపడ్డారు. ప్రజలు 52 వేల ఓట్ల తేడాతో ఓడించినా పేర్ని నానికి సిగ్గు రాలేదని ధ్వజమెత్తారు. అభివృద్ధిని అడ్డుకోవడమే ఆయన పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. పట్టాభి సీతారామయ్య స్మారక భవననిర్మాణానికి సంబంధించి కోర్టు ఆదేశాలను సైతం పేర్ని నాని పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా నిర్మించి తీరుతామని స్పష్టం చేశారు.