జనగామ మండలంలోని చౌడారం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ విక్రమ్ POCSO చట్టంపై న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా విక్రమ్ మాట్లాడుతూ 18 సం" లోపు ఉన్న బాలికలను ఎవరైనా మాటలతో గానీ శారీరకంగా గానీ,వెంట పడటం చేస్తే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఏదైనా తప్పు జరిగితే వెంటనే పాఠశాల ఉపాధ్యాయులకు లేదా తల్లిదండ్రులకు తెలియజేయాలన్నారు.బాల్య వివాహాల గురించి కూడా విద్యార్థులకు అవగాహన కల్పించారు.18 సంవత్సరాల లోపు ఉన్న బాలికలు వివాహం చేసుకుంటే చెల్లదని,చేసుకున్నవారికి కఠినమైన శిక్ష తప్పదు అన్నారు.