గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్లో అంబేద్కర్ ర్యాలీలో టవల్ తిప్పుతూ జై భీమ్ అంటూ హాల్ చల్ చేసిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము స్తానిక గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్ లో రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని జై భీమ్ వెల్ఫేర్ సొసైటీ మరియు అంబేద్కర్ అభిమాన సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో ఏర్పాటు చేశారు. నెహ్రూ చౌక్ సెంటర్లో ఏర్పాటు చేయనున్న అంబేద్కర్ కాంస్య విగ్రహానికి గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మరియు దళిత సంఘాల నేతలు, అంబేద్కర్ అభిమానులు ఘన స్వాగతం పలికారు.