గుత్తి,గుత్తి ఆర్ఎస్ లలో శుక్రవారం మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం మత పెద్దల ఆధ్వర్యంలో మిలాద్ ఉన్ నబీ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. మక్కా మసీదు నమూనాలతో ప్రధాన వీధుల గుండా, రహదారుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం మతపెద్దలు మాట్లాడారు. మిలాద్ ఉన్ నబి పర్వదినం చాలా పవిత్రమైందన్నారు. ముస్లింలందరూ సంతోషంగా పండగను జరుపుకోవాలని ఆకాంక్షించారు.