భారతదేశం నేపాల్ మాదిరిగా అవినీతిలో కూరుకుపోకూడదని జనసేన ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ హెచ్చరించారు. శుక్రవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. నేపాల్‌లో రాజకీయ అవినీతి, వ్యక్తిగత లాభాల కోసం నాయకులు ఎంచుకున్న మార్గాలు ఆ దేశ విచ్ఛిన్నానికి కారణమయ్యాయని ఆయన పేర్కొన్నారు.అవినీతి వల్ల నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, పేదరికం పెరుగుతాయని, ఇది దేశ భద్రతకు ముప్పు అని సత్యనారాయణ అన్నారు. ప్రజలు పారదర్శకత, బాధ్యత, నిజాయితీ ఉన్న నాయకులను మాత్రమే ఎన్నుకోవాలని ఆయన సూచించారు.