భారీ వర్షాల కారణంగా గోదావరిలో భారీ వరద ప్రభావం వస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలియజేశారు ఈ మేరకు వారు మంథని లోని గోదావరి నదిని పరిశీలించారు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వివిధ ప్రాజెక్టుల నుండి విడుదల చేస్తున్న అవుట్ ఫ్లో వివరాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అవసరమైతే లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్ అధికారులు ఆదేశించారు.