Download Now Banner

This browser does not support the video element.

పంటు రాకపోకలు నిలిచిపోవడంతో ముక్తేశ్వరం రేపు వద్ద ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు

Pedapudi, Kakinada | Sep 14, 2025
అయినవిల్లి మండలం పరిధిలోని ముక్తేశ్వరం-కోటిపల్లి రేపు వద్ద గోదావరి నదిని దాటే ప్రయాణికులు ఆదివారం ఉదయం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గోదావరి నదికి వరద ఉధృతి నేపథ్యంలో పంటు రాకపోకలు నిలిచిపోయాయి. సుదూర ప్రాంతం నుంచి వచ్చే ప్రయాణికులకు ఈ విషయం తెలియక పోవడంతో వారు రేవు వద్దకు వచ్చి మరలా నిరాశగా తిరిగి వెళుతున్నారు. పంటు రాకపోకలను నిలిపివేసినట్లుగా కనీసం ఫ్లెక్సీలు అయినా ఏర్పాటు చేయాలని వారు కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us