గ్రామాలలో చెత్తను తొలగించకపోవడంతో వ్యర్థాలు పేరుకు పోతున్నాయి. వీటిని పశువులు ఆహారంగా భావించి పలహారంగా భుజిస్తున్నాయని స్థానికులు అంటున్నారు. గూడూరు మున్సిపల్ పరిధిలోని నెల్లటూరులో పారిశుద్ధ్య సిబ్బంది ప్రతిరోజూ చెత్తను తరలించకపోవడంతో ఎక్కడ వేసిన చెత్త అక్కడే పేరుకుపోతుందన్నారు. పశువులు వాటిని తిని అనారోగ్యం పాలవుతున్నాయన్నారు. అధికారులు పారిశుద్ధ్య నిర్వహణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.