పలాస మండలం కేసుపురం గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి దాటిన వేళ చిల్లంగి నెపంతో గ్రామానికి చెందిన వృద్ధుడు ఉంగ శ్రీరాములు (80) ని రాళ్లతో కొట్టి హత్య చేశారు. అదే గ్రామానికి చెందిన అంబాల తులసిరావు (35) వ్యక్తి ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. పలు ప్రాంతాల్లో ఉన్న దాసుల వద్దకు వెళ్ళగా... గ్రామానికి చెందిన వ్యక్తి చేతబడి చేయడంతో ఇలా జరిగిందని తెలిపారు. శ్రీరాముల పై అనుమానంతో ఈ ఘాతకానికి పాల్పడి ఉంటారని పలువురు అనుమానిస్తున్నారు... బుధవారం ఉదయం ఏడు గంటల 30 నిమిషములకు నా స్థలానికి చేరుకున్న కాశిబుగ్గ డీఎస్పీ వెంకట అప్పారావు ఘటన పై దర్యాప్తు చేపట్టారు..