నేపాల్ లో చిక్కుకున్న వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ సూపర్ అని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి అన్నారు. సూపర్ సిక్స్ సభకు కూడా పోకుండా అమరావతిలోనే ఉండి స్వయంగా పర్యవేక్షించారని శుక్రవారం వెల్లడించారు. నేపాల్ లో చిక్కుకున్న 215 మంది తెలుగు వారిని క్షేమంగా ప్రత్యేక విమానాల్లో స్వస్థలాలకు తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారని కొనియాడారు.