శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం గోపేపల్లి తండా వాసులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. తమ గ్రామంలో నెలకొన్న తాగునీటి ఎద్దడిని తీర్చాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ను కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... తమ తండాలో తాగునీటి సమస్య అధికంగా ఉందని, నెలకు ఒకసారి గ్రామంలోని ట్రాన్స్ ఫార్మర్తో పాటు బోరు మోటర్ పంప్ కూడా కాలిపోతోందన్నారు. విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా తమసమస్య పట్టించుకోలేదన్నారు. తాజాగా 20 రోజల క్రితం బోరు మోటరు కాలిపోవడంతో తాము సమీపంలోని వ్యవసాయ బోరుమోటార్ల వద్దకు వెళ్లి తాగునీరు తెచ్చుకుంటున్నామని వాపోయారు.