అవనిగడ్డ లో వినాయక ఉత్సవాలలో పోలీసు నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అవనిగడ్డ డీఎస్పీ తాళ్లూరి విద్యాశ్రీ శనివారం హెచ్చరించారు. విగ్రహాలు ఐదు అడుగులకు మించరాదని, డీజేలకు అనుమతి లేదని, రాత్రి పది గంటల వరకే మైకులకు అనుమతి ఉందని తెలిపారు. నిమజ్జనాలకు 11 రోజుల వరకు అనుమతి ఉందని, కమిటీలను ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.