గణేష్ ఉత్సవ నిర్వాహకులు ఉత్సవ మండపాల వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు పాటించాలని, మంగళవారం మధ్యాహ్నం బొండపల్లిలో గజపతినగరం సర్కిల్ ఇన్స్పెక్టర్ జిఏ వి రమణ సూచించారు. ట్రాఫిక్కుకు అంతరాయం లేకుండా గణేష్ ఉత్సవ మండపాలను ఏర్పాటు చేసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసే ప్రదేశాల గురించి కూడా ముందుగా పోలీస్ శాఖకు సమాచారం తెలియజేయాలని చెప్పారు ఈ సమావేశంలో బొండపల్లి ఎస్ఐ యు మహేష్ పాల్గొన్నారు.