ఆదిలాబాద్ జిల్లాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా బుధవారం ఏకతాటిగా కురుస్తున్న భారీ వర్షంతో జైనథ్ మండల కేంద్రంలోని 9వ వార్డులోని పలు ఇళ్లల్లోకి వరద నీరు వచ్చి చేయడంతో ప్రజలు ఈ ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరడంతో పలు ఇళ్లల్లో సామాగ్రి నీట మునిగి తడిసి ముద్దయ్యాయి. ప్రాంతాల ప్రజల సమస్యలను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.