అనంతపురం జిల్లాలోని సింగనమల నియోజకవర్గం గార్లదిన్నె మండలం కృష్ణాపురంకు చెందిన వేణు అనే వ్యక్తి ఒరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. దీంతో గమనించిన కుటుంబ సభ్యులు అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు.