గణపవరం మండలం కాశిపాడులో భలే వెంకటరత్నం అనుమానాస్పదంగా శనివారం మృతి చెందాడు. గణపవరం ఎస్ఐ మణికుమార్ ఘటనా స్థలానికి చేరుకొని డెడ్ బాడీని పరిశీలించారు. గత కొద్ది రోజులగా వెంకటరత్నం మద్యానికి బానిసయ్యాడు. శుక్రవారం రాత్రి అతిగా మద్యం తాగి పడుకున్నాడని. ఉదయం లేచి చూసేసరికి నోరు, చెవి నుంచి రక్తం వచ్చిన స్థితిలో అనుమానస్పదంగా మరణించి ఉన్నాడని మృతుడి తమ్ముడు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.