ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కారం ఉండాలని హితవు పలికారు.కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ వినతుల స్వీకరణ కార్యక్రమం సోమవారం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా రెవిన్యూ అధికారి కె.హేమ లత, ప్రత్యేక ఉప కలెక్టర్ పి.ధర్మచంద్రారెడ్ది, డిఆర్డిఏ పీడీ ఎం.సుధారాణితో కలిసి ప్రజల నుంచి వినతులను కలెక్టర్ స్వీకరించారు. అర్జీలు సత్వరమే పరిష్కరించాలన్నారు.