బాపట్ల పట్టణంలో రహదారులపై సంచరిస్తున్న ఆవులు పంటలు నాశనం చేస్తున్నాయని రైతులు మంగళవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు కూరగాయల తోటలు నాశనం కావడం జరిగిందన్నారు. మిగిలిన మొక్కలను ఆవులు పాడు చేస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పట్టణంలో సంచరిస్తున్న ఆవులను సురక్షిత ప్రాంతాలకు తరలించి పంటలను కాపాడాలని రైతులు కోరుతున్నారు.