వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని సాల్విడ్ గ్రామంలో చెంచు కుటుంబాలకు సయోధ్య స్వచ్ఛంద సంస్థ సహకారంతో పేపర్ ప్లేట్స్ తయారు చేసే మిషన్ లను జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ.. చెంచు కులస్తులకు స్వయం ఉపాధి పొందే విధంగా పేపర్ ప్లేట్స్ తయారు చేసే మిషన్లు ఇవ్వడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. చెంచు కులస్తులు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చందేందుకు ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలను అందజేయడం జరుగుతుందని ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు.