సీపీఐ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డికి సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం హైదారాబాద్లోని మగ్ధూం భవన్లో సురవరం భౌతికకాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో వామపక్ష భావజాలం పెంపొందించేందుకు సుధాకర్ ఎంతో కృషి చేశారని కొనియాడారు.