గుంతకల్లు మండలం ఓబులాపురం గ్రామంలో బుధవారం విషాదం చేస్తుంది. గ్రామానికి చెందిన నాగిరెడ్డి కుమార్తె పుష్పలత (19) ఇంటిలో ఫ్యానుకు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కడుపు నొప్పి తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని గుంతకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై గుంతకల్లు రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.