మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా వినాయక నవరాత్రి ఉత్సవాల నిమజ్జన శోభాయాత్ర కన్నుల పండువగా జరిగాయి. గణనాథుని శోభయాత్రకు పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తు నిర్వహించారు. నవరాత్రుల్లో చివరి రోజు కావడంతో గణనాథులు గంగమ్మ ఒడిలోకి చేరాయి. విశ్వహిందు పరిషత్ ఆద్వర్యంలో గణనాధులకు స్వాగతం పలికారు. ఈ మేరకు శనివారం మధ్యాహ్నం విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేసిన కార్యక్రమంలో డీసీపీ భాస్కర్ పాల్గొని మాట్లాడుతూ మన సంప్రదాయాలను పాటించాలనీ, కుల మతాలకతీతంగా పండుగలు జరుపుకోవాలనీ తెలిపారు. మంచిర్యాల పట్టణంలో సుమారు 400 విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.