మంచిర్యాల జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వచ్చే వరద నీటి ఇన్ ఫ్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం హాజీపూర్ మండలంలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు లోకి చేరుతున్న వరదనీటి పరిస్థితిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎగువన ఉన్న ఎస్ఆర్ఎస్పి, కడెం ప్రాజెక్టుల నుండి వరద నీటిని విడుదల చేయడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద నీరు పెరుగుతుందని తెలిపారు.