ప్రజా సమస్యల పరిష్కారంలో జిల్లాను మొదటి స్థానంలో ఉంచాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. సోమవారం డోన్ డివిజన్ కేంద్రంలోని డోన్ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ నరసింహులు మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడ్ వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు