చిన్నశంకరంపేట మండల వ్యాప్తంగా వినాయక మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని ఎస్ఐ నారాయణ సూచించారు. పోలీస్ శాఖ వెబ్ సైట్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వినాయకుల నిమజ్జనం నిర్వహించుకోవాలని, తప్పనిసరిగా పోలీస్ శాఖ వారి అనుమతులు తీసుకోవాలని సూచించారు, విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ఏర్పాటు చేసుకోవాలని, నిమర్జనానికి డీజే అనుమతులు లేవని డీజే ఆపరేటర్లకు నోటీసులు ఇవ్వడం జరిగిందని, ఎవరైనా DJ పెట్టి నిమజ్జనం నిర్వహించినట్లయితే వారిపై చట్టరిత్య చర్యలు తీసుకోవడం జరుగుతుందని, డీజే ను సీజ్ చేయడం జరుగుతుందన్నారు