ములుగు జిల్లా కేంద్రంలో వీ-హబ్ ఆధ్వర్యంలో జిల్లా మహిళా పరిశ్రామికవేత్తలకు "ర్యాంప్ వుమెన్ అక్సెలేరేషన్ ప్రోగ్రాం" పైన అవగాహన కార్యక్రమం నేడు మంగళవారం రోజున మధ్యాహ్నం 3 గంటలకు ఏర్పాటు చేయగా మంత్రి సీతక్క పాల్గొని మాట్లాడుతూ... మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను చేపడుతోందని, "మహిళలను ఆర్థికంగా పరిపుష్టం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం మహిళాశక్తి లో బాగంగా ఎన్నో ప్రోత్సాహకాలు ఇస్తోందన్నారు.