అన్నమయ్య జిల్లా రాయచోటిలో జరిగిన వ్యవసాయ మార్కెట్ చైర్మన్‌ల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ..రాబోయే మూడు సంవత్సరాల్లో రాయచోటి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ కోసం శ్రమించిన ప్రతి కార్యకర్తను గుర్తుంచుకొని, పార్టీ బలపరిచేందుకు కృషి చేసిన వారికి తగిన గౌరవం, పదవులు వచ్చేలా తన వంతు కృషి చేస్తానని మంత్రి తెలిపారు.అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పార్టీ బలపరచడంలోనూ ఎలాంటి వెనుకడుగు వేయబోమని స్పష్టం చేశారు.