శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్లో శనివారం ఉదయం 11.30 కి ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలు జరుపుకునేందుకు ముందుగా ఆన్లైన్లో యాప్ ద్వారా పర్మిషన్స్ తీసుకోవాలని దీనికి సంబంధించి ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదని అన్నారు. మైక్ సెట్ , సౌండ్ సిస్టం పెట్టుకోవాలంటే కచ్చితంగా DSP పర్మిషన్ తీసుకోవాలని దీనికి ఫీజు చెల్లించవలసి ఉంటుందని అన్నారు.