సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం మాడిగి అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్పోస్ట్ వద్ద అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పోలీసులు, సివిల్ సప్లై అధికారులు పట్టుకున్నారు. బుధవారం మధ్యాహ్నం వాహనాల తనిఖీ నిర్వహించి శంకర్పల్లి పరిసర ప్రాంతాల నుండి తక్కువ ధరకు కొనుగోలు చేసిన రేషన్ బియ్యం గుజరాత్ రాష్ట్రానికి తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. లారీలో తరలిస్తున్న 311 బియ్యం, లారీని స్వాధీనం చేసుకొని ఇద్దరు వ్యక్తులపై చేసిన కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజేందర్ రెడ్డి తెలిపారు పట్టుకున్న బియ్యం విలువ సుమారు 10 లక్షలు రూపాయలు ఉంటుందన్నారు. తనిఖీల్లో సివిల్ సప్లై డీటీ బసవరాజ్, సిబ్బంది ఉన్నారు