SKITను సందర్శించిన జేఎన్టీయూ VC శ్రీకాళహస్తిలోని SKIT కళాశాలను MLA బొజ్జల సుధీర్ రెడ్డితో కలిసి JNTU వీసీ శుక్రవారం సందర్శించారు. ఇందులో భాగంగా తరగతులు ప్రారంభించుటకు గల సన్నాహాకాలపై చర్చించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అసంపూర్తిగా మిగిలిన భవనాలను సకాలంలో నిర్మించాలని సిబ్బందికి సూచించారు. క్లాసులు ప్రారంభించడానికి ప్రభుత్వం పరంగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు.