అనంతపురంలో ఈనెల 10న సూపర్ సెక్స్ -సూపర్ హిట్ విజయోత్సవ వేడుకలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానున్నారు. ఈ నేపథ్యంలో శనివారం పార్కింగ్ స్థలాల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పరిశీలించారు. అనంతపురం-బెంగళూరు జాతీయ రహదారి పక్కన, ప్రసన్నాయన పల్లి గేటు వద్ద ఏర్పాటు చేయనున్న పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. పార్కింగ్ ఏర్పాట్లను పక్కాగా చేయాలని స్థానిక అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ జగదీష్, జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ తదితరులు పాల్గొన్నారు.