Download Now Banner

This browser does not support the video element.

మంత్రాలయం: సాతునురు కొట్టాల గ్రామం భవనాన్ని మరమ్మతులు చేయించండి గ్రామస్తులు డిమాండ్

Mantralayam, Kurnool | Sep 1, 2025
కోసిగి: మండలంలోని సాతనూరు కొట్టాల గ్రామ పాఠశాలలో విద్యార్థులు తీవ్ర ప్రమాదంలో చదువులు కొనసాగిస్తున్నారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనం ఒక ఇనుపరాడుపైనే ఆధారపడి ఉండగా, ఇటీవల వరండాలో ఐదు అడుగుల విస్తీర్ణంలో పైకప్పు కూలిపోయింది. అదృష్టవశాత్తు ఆ రోజు సెలవు కావడంతో విద్యార్థులు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. గ్రామస్తులు విద్యా కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో తమ సొంత ఖర్చులతో మరమ్మతులు చేయించామన్నారు.తమ సమస్యను ఉపాధ్యాయుల సహాయంతో అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన చేసినా పట్టించుకోవడం లేదన్నారు. సోమవారం ఈ విషయమై ఎంఈఓ ను వివరణ కోరగా సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us