ఐకెపిలో పనిచేస్తున్న VOA లకు రూ.26 కనీస వేతనం ఇవ్వాలని,రిటైర్డ్ కార్మికులకు 7వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని సీఐటీయూ మండల కన్వీనర్ ఆనంద్ రావు డిమాండ్ చేశారు. శనివారం కెరమెరి మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ..కార్మికులు అత్యంత శ్రమ చేస్తున్న అందుకు తగ్గ వేతనం ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వాలు కార్మికుల శ్రమను దోచుకుంటున్నాయన్నారు. కార్మికుల శ్రమను దోచుకునే విధంగా ప్రభుత్వాలు కార్పొరేట్లకు చట్టాలు చేసి పెడుతున్నాయని విమర్శించారు. కార్మికుల వేతనాలు పెరగడంలేదన్నారు.