ప్రకాశం జిల్లా ఒంగోలు ఎమ్మెల్యే మరియు రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్ధన్ బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను కలిసి నియోజకవర్గ సమస్యలను వివరిస్తూ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని అభివృద్ధి పనులు మరియు కొత్తగా ఏర్పాటు చేయనున్న ఎయిర్పోర్ట్, షిప్పింగ్ యాడ్, స్థానిక అభివృద్ధి కార్యక్రమాలపై మాట్లాడారు. దీనికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందిస్తూ అభివృద్ధిని పెంపొందించేందుకు నిరంతరం కృషి చేయాలని దానికి పూర్తి సహకారం ఉంటుందని భరోసా కల్పించారు. నియోజకవర్గం లో అందరినీ కలుపుకుపోతున్న ఎమ్మెల్యే జనార్ధన్ ను ప్రత్యేకంగా అభినందించారు.