జిల్లాలో సెప్టెంబర్ 1వ తేదీ నుండి ఇప్పటివరకు 4380 మెట్రిక్ టన్నుల యూరియా వచింది: జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బుధవారం సాయంత్రం 6 గంటల సమయంలో జిల్లా కలెక్టర్ స్తానిక మచిలీపట్నంలోని వారి చాంబర్లో యూరియా స్థితిగతులపై పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో సెప్టెంబర్ 1 వ తేదీ నుండి ఇప్పటివరకు 4380 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు వచ్చిందన్నారు. ఆ యూరియాను రైతులకు ఇప్పటికే పంపిణీ చేస్తున్నామన్నారు. రేపు గురువారం మరో 2,600 మెట్రిక్ టన్నులు, ఎల్లుండి శుక్రవారం మరో 1,800 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు రానుందన్నారు.