అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండల కేంద్రం నుంచి ఏలేశ్వరం వెళ్లే రహదారిని బాగు చేయాలంటూ ఆదివాసి గిరిజన సంఘాలు ఆధ్వర్యంలో శుక్రవారం భారీ ఎత్తున రాస్తారోకో ధర్నా చేపట్టారు. రహదారి బాగు చేయాలంటూ శుక్రవారం ఉదయం నుంచి లక్ష్మిపురం రోడ్డు వద్దకు ఆందోళనకారులు చేరుకుని రాకపోకలను నిలువరించారు. రహదారిపై టెంట్ వేసి అధికారులకు ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికారులు ప్రజాప్రతినిధులు వచ్చి సమస్య పరిష్కరించక పోతే ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ ఆదివాసి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోత రామారావు హెచ్చరించారు