కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి మంగళవారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించారు. కోడుమూరు పట్టణానికి చెందిన బజారి, గూడూరుకు చెందిన రామచంద్రుడు వివిధ ఆరోగ్య కారణాల రిత్యా ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే అందించారు. బాధితుడు రామచంద్రుడికి ఆసుపత్రిలో ఎమ్మెల్యే అందజేయడంతో ఆయన కృతజ్ఞతలు తెలిపారు.