వెల్దుర్తి సచివాలయం-1లో కుర్చీల కొరత కారణంగా ప్రజలు తీవ్ర అసౌకర్యానికి లోనవుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, గర్భిణులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు సచివాలయాల్లో సేవల కోసం అనేక గంటల పాటు నిలబడాల్సి వస్తోందని వారు బుధవారం వాపోతున్నారు. పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించాలని కోరుతున్నారు.