తిరుపతి జిల్లా గూడూరు మండలం చెన్నూరు గ్రామం రామలింగయ్య కాలనీలో చినుకు పడితే రోడ్డు బురదమయంగా మారిపోతోంది. గత రాత్రి కురిసిన వర్షానికి ఆ కాలనీలో మోకాళ్ల లోతు నీరు పారుతోంది. వర్షపు నీరు ఇళ్లల్లోకి చేరి నడక కూడా నరకంగా ఉందని కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు. దీంతో పక్కనే ఉన్న సచివాలయంలోకి వెళ్లి ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలకులు స్పందించి సమస్య పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.