మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రైతులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఉదయం నుండి క్యూ లైన్ లో నిలబడ్డ యూరియా బస్తాలు దొరకకపోవడంతో ఆగ్రహం చెందినా రైతులు గ్రోమోర్ సెంటర్ పై రాళ్లతో దాడి చేశారు జిల్లా కేంద్రంలోని సూర్యా థియేటర్ సమీపం వద్ద ఉన్న గ్రోమోర్ సెంటర్ పై మహిళా రైతులు రాళ్లు ఇటుక బిడ్డలతో దాడికి పాల్పడ్డారు రోజుల తరబడి యూరియా కోసం క్యూ లైన్ లలో పడిగాపులు పడ్డ యూరియా దొరకటం లేదని పంటలకు అవసరమైన సమయంలో యూరియా దొరక్క పోవడంతో పంట పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.