అనంతపురం జిల్లాకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈనెల 10వ తేదీన రానున్న నేపథ్యంలో పర్యటనను విజయవంతం చేద్దామని అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం నగరంలోని జిఎంఆర్ గ్రాండ్ సమీపంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన సభా వేదిక ఏర్పాటుకు సంబంధించి భూమి పూజ కార్యక్రమానికి అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరై భూమి పూజను నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు