ఇంటింటికి రేషన్ సల్ఫరా చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలు సచివాలయ ఉద్యోగులను కించపరచడమేనని రాష్ట్ర గ్రామ వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు షేక్ అబ్దుల్ రజాక్ అన్నారు. అధికారులు ఇస్తున్న ఆదేశాలు ఉద్యోగులను గందరగోళానికి గురిచేస్తున్నాయని ఆయన పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలో ఆదివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో పేర్కొన్నారు. ఉన్నత విద్యావంతులైన ఉద్యోగుల విలువలను తగ్గించేలా ఈ నిర్ణయం ఉందని ప్రభుత్వం తమ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.