జగిత్యాల జిల్లా ధర్మపురి మండల కేంద్రంలోని కస్తూరిబాగాంధీ బాలికల విద్యాలయంలో శనివారం రోజున న్యాయ విజ్ఞాన సదస్సును ఏర్పాటు చేసారు.ఈ కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా ధర్మపురి జూనియర్ సివిల్ జడ్జి జానకి హాజరైయ్యారు.విద్యార్థులకు చట్టాల పట్ల అవగహన కల్పించడంతో పాటు వాటి ఎలా వినియోగించుకోవాలనే అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ. ప్రతీ విద్యార్థిని న్యాయ వ్యవస్థలో ఉన్న చట్టాలపై అవగహనను పెంచుకోవాలని సూచించారు. ముఖ్యంగా మహిళలు తముకున్న చట్టాలను తెలుసుకోవాలని, మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు.