అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు పట్టణంలో శనివారం సాయంత్రం ఏడు గంటల సమయంలో ఓ పిచ్చి కుక్క స్వైర్య విహారం చేసింది. రోడ్డుపైకి ఒక్కసారిగా వచ్చిన కుక్క పాదాచార్లను ఖర్చు కుంటూ వెళ్లడంతో సుమారుగా 30 మందికి పైగా పిచ్చికుక్క బాధితులు పాడేరు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఒక్కసారిగా అంతమంది పిచ్చికుక్క బాధితులు రావడంతో ఆసుపత్రి రద్దీగా మారింది. కుక్క దాడి ఘటనపై పంచాయతీ అధికారులకు స్థానికుల ఫిర్యాదు చేయడంతో కుక్కను పట్టుకునే ప్రయత్నంలో పంచాయతీ అధికారి నిమగ్గినమయ్యారు.