ప్రొద్దుటూరు నెహ్రూ రోడ్డులోని టిడిపి కార్యాలయంలో టిడిపి కౌన్సిలర్లు మురళీధర్ మీడియా సమావేశం నిర్వహించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ఆయిల్ మిల్ ఖాజా చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖాజా గత చరిత్రను ముందుగా బయటపెట్టాలని డిమాండ్ చేశారు. నిన్ను ఎప్పుడైనా మేము బ్లాక్ మెయిల్ చేశామా? నీ ఇంట్లో ఎస్ఐ చెకింగ్ చేసిన సమయంలో కూడా మేమే వెనక్కి పంపించాం. ఎన్నో రకాలుగా నీకు సహాయం చేశాం. మైనారిటీ నాయకుడివి అని ప్రత్యేకంగా ప్రోత్సహించాం. అయినా ఇప్పుడు నీ పబ్బం గడిపేందుకు తప్పుడు ఆరోపణలు చేస్తావా? అని ప్రశ్నించారు.