పిడిఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు సోమవారం ఓయూలో మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి కోసం ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వస్తుందని ఆశించిన విద్యార్థులకు నిరాశ మిగిలిందని అన్నారు. రేవంత్ మాటలు కేవలం ప్రకటనలకే పరిమితమయ్యాయని, ఓయూ అభివృద్ధిపై జీవో చేసే అధికారమున్న రేవంత్ రెడ్డి అలాంటిది ఏమీ చేయలేదని ఆయన మండిపడ్డారు.