రాజంపేట సభలో మామిడి రైతులకు నిధులు విడుదలైనట్లు చెప్పిన ముఖ్యమంత్రి వ్యాఖ్యలు నిజం కాదని, తోతాపురి మామిడి రైతుల ఖాతాల్లో మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం (M.I.S) నిధులు వెంటనే జమ చేయాలని రాయచోటి మండల లీగల్ సర్వీసెస్ కమిటీ మాజీ సభ్యులు యర్రపురెడ్డి విశ్వనాథరెడ్డి గురువారం డిమాండ్ చేశారు.రైతులకు ఆదేశాల ప్రకారం చెల్లింపులు చేయని గుజ్జు పరిశ్రమలపై చర్యలు తీసుకుని, 60 వేల మంది రైతులకు న్యాయం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు